సమాధి నుంచి శవాన్ని తీసి పూజలు.. బాలుడిని బతికించేందుకు తాంత్రికుల యత్నం..! - పాముల పట్టేవారు బతికిస్తామనడం వల్ల సమాధి నుంచి శవం వెలికితీత
🎬 Watch Now: Feature Video
నాగుపాము కాటుకు గురై చనిపోయిన ఓ బాలుడిని బతికించేందుకు తాంత్రికులు విఫలయత్నం చేశారు. బాలుడి మరణించగానే కుటుంబ సభ్యులు, బంధువులు అతడి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అయితే, పాములు పట్టేవారు బాలుడ్ని బతికిస్తామని చెప్పడం వల్ల పూడ్చిపెట్టిన శవాన్ని వెలికితీశారు కుటుంబ సభ్యులు. చేతిలో వేపకొమ్మలు పట్టుకుని.. మంత్రాలు పఠిస్తూ పాములు పట్టేవారు పూజలు చేశారు. ఎంతకీ బాలుడిలో చలనం లేకపోవడం వల్ల మళ్లీ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ అలీగఢ్ జిల్లాలోని శివాల ఖుర్ద్లో జరిగింది.