SNAKE SWALLOWING SNAKE: పామును పామే మింగేసింది! - తెలంగాణ పాము వార్తలు
🎬 Watch Now: Feature Video
పాముకు ఆకలేస్తే... ఏ కప్పనో, ఎలుకనో తినడం మనం చూస్తూనే ఉంటాం. మరీ ఆకలిస్తే... పాము తన పిల్లలనే చంపి తింటుందనీ విన్నాం. కానీ అది నిజమో కాదో కూడా మనకు తెలీదు. ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతోంది ఓ పాము. ఏంటి పాము చెబుతుందా అనుకుంటున్నారా...? జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో ఓ పాము మరో పామును మింగింది. గ్రామానికి చెందిన స్వామిరెడ్డి... పొలంలో పనులు చేస్తుండగా ఈ దృశ్యం కనిపించింది. ఆకలితో ఉన్న చెడుగు పాముకు పసిరిక పాము దొరికింది. ఇంకేముంది వెంటనే దాని తోకను నోట్లోకి లాగుతూ మింగసాగింది. పిల్ల పాము ఎంత గింజుకున్నా వదలకుండా పూర్తిగా మింగేసి దాని ఆకలి తీర్చుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన రైతు స్వామి రెడ్డి... తన ఫోన్లో పాములను బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.