సింగూరు సోయగం - తెలంగాణ వార్తలు
🎬 Watch Now: Feature Video
సింగూరు ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. సంగారెడ్డి జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో మంజీరా నదికి వరద పోటెత్తింది. సింగూర్ ప్రాజెక్టులోకి 4109 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.9టీఎంసీలు కాగా... ప్రస్తుతం 20.185టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి నీటి మట్టం 523.6మీటర్లు కాగా... ప్రస్తుతం 521.570మీటర్ల ఎత్తులో నీటి మట్టం ఉంది. నిండు కుండలా మారిన సింగూరు జలాశయం చూపరులకు కనువిందు చేస్తోంది. గంగమ్మ పరవళ్లు తొక్కుతున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.