ప్రతిధ్వని: తుక్కువిధానం, హరితపన్నుతో కొత్తకలవరం - prathidwani special debate on scarp policy in budget 2021
🎬 Watch Now: Feature Video

చాలా కాలంగా ప్రతిపాదనల్లో ఉన్న స్వచ్ఛంద వాహన తుక్కు విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టాలెక్కించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దీనిని అమలు చేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇది అమలులోకి వస్తే.. 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు, 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలు.. ఇక నుంచి తుక్కుగా మారాల్సిందే. అలాగే 8 ఏళ్లు దాటిన దగ్గర నుంచి వాణిజ్య వాహనాలపై హరితపన్ను కూడా విధించబోతున్నారు. ఈ విధానం ద్వారా ఆటోమెబైల్ రంగం పురోగమిస్తుందనేది కేంద్రం ఆలోచన. అయితే ఇప్పటికే తీవ్రనష్టాల్లో ఉన్నటువంటి వాణిజ్య,రవాణా రంగం మరింత దెబ్బతింటుదనేది ఆ రంగానికి చెందిన వారి ఆందోళన. అయితే పర్యావరణ కోణంలో చూసినప్పుడు దీనిని అమలు చేయాలని మరికొందరి సూచన. ఈ అంశంపై భిన్నమైన వాదనలు ఉన్న తరుణంలో దీనిపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.