ప్రతిధ్వని: విశాఖ ఉక్కు ప్రైవేటుపరమైతే.. ఉద్యోగ, ఉపాధి భద్రతకు భరోసా ఉందా ?
🎬 Watch Now: Feature Video
తెలుగువారి ఆత్మగౌరవ నినాదానికి నిలువెత్తు నిదర్శనం.. విశాఖ ఉక్కు కర్మాగారం. 32 మంది ఉద్యమకారుల ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు.. ఇప్పుడు ప్రైవేటు పరం కాబోతోంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెట్ పరిధిలోని ప్రభత్వ రంగ వాటాలను 100 శాతం ప్రైవేటుకు అమ్మేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటాల అమ్మకంపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తూనే.. వారి సహకారం కూడా పొందుతున్నామంటూ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల మందికి జీవనాధారంగా నిలిచిన ఉక్కు ఫ్యాక్టరీ భవితవ్యంపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చ చేపట్టింది.