ప్రతిధ్వని: రజనీకాంత్ ఎందుకు వెనకడుగు వేశారు..? - PRATHIDWANI DEBATES
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10051148-184-10051148-1609255281977.jpg)
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్.. తాను రాజకీయ పార్టీని స్థాపించడం లేదంటూ సంచలన ప్రకటన చేశారు. అనారోగ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజాసేవను కొనసాగిస్తానని వెల్లడించారు. తన నిర్ణయం అభిమానులను విపరీతంగా బాధపెట్టి ఉండవచ్చని.. అందుకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. పార్టీ ప్రకటనకు ముందు తాను అనారోగ్యం బారిన పడడాన్ని దేవుడి సూచనగా భావిస్తున్నానని రజనీకాంత్ వెల్లడించారు. రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టేందుకు ఎందుకు వెనకడుగు వేశారు. అసలు మొదటి నుంచీ రాజకీయ ఆరంగేట్రంపై రజనీ ఎందుకు తర్జన భర్జన పడుతున్నారు. తాజా తమిళనాడు రాజకీయ పరిణామాలపై ప్రతిధ్వని చర్చ.