ప్రతిధ్వని: పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాని పిలుపు మేలిమలుపవుతుందా..? - విదేశీ పెట్టుబడులకు ప్రధాని పిలుపు
🎬 Watch Now: Feature Video

విదేశీ పెట్టుబడులకు మన దేశం గమ్యస్థానం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. కొవిడ్ సంక్షోభాన్ని ఇందుకు సదావకాశంగా మార్చుకోవాలని బ్లూమ్బర్గ్ ఎకనమిక్ ఫోరంలో ఆయన పిలుపు నిచ్చారు. పట్టణాభివృద్ధి, నవ్యావిక్షరణ రంగాల్లో ఎఫ్డీఏలకు మన దేశం కేంద్రం కానుందన్నారు. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుందని గోల్డ్ మ్యాన్ స్యాక్స్ అంచనా వేసింది. ఈ శుభసంకేతాల నేపథ్యంలో విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాని పిలుపు ఒక మేలి మలుపు అవుతుందా? పట్టణాల్లో ఈ పెట్టుబడులు..అభివృద్ధికి ఏవిధంగా బాటలు వేస్తాయి. ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది.