ప్రతిధ్వని: మూడో త్రైమాసికంలో వృద్ధి పెరిగేందుకు ఉన్న అంశాలేంటి?
🎬 Watch Now: Feature Video
కరోనా సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి వేగంగా పుంజుకుంటోందని ఆర్బీఐ వెల్లడించింది. మూడో త్రైమాసికంలో వృద్ధి సానుకూలంగా మారవచ్చని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం జీడీపీ 24 శాతం మేర క్షీణించగా.. అది రెండో త్రైమాసికానికి 7.5 శాతానికే పరిమితమైంది. కరోనా కేసులు తగ్గటం, ఆత్మనిర్భర్, పీఎంజీకేపీ వంటి పథకాలతో వినియోగం-పెట్టుబడులు ఊపందుకోవటానికి అవకాశం ఏర్పడింది. మరోవైపు ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మూడో త్రైమాసికంలో వృద్ధి పెరిగేందుకు దోహదపడే సానుకూల అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.