పంటల బీమాతో ప్రయోజనం పొందుతున్న రైతులెందరు?
🎬 Watch Now: Feature Video
ఆరుగాలం కష్టపడి బురదను బువ్వగా మారుస్తున్న రైతన్నకు ఆసరాగా నిలవాల్సిన పంటల బీమా... రైతుల పాలిట గుండె మంటగా మారింది. ప్రకృతి విపత్తులు, చీడపీడల దాడిలో ఓడిపోయినప్పుడు చేదోడుగా నిలవాల్సిన బీమా పథకాలు రైతుకు మొండి చేయి చూపిస్తున్నాయి. పంటలకు రక్షణ ఆశిస్తూ సొంతంగా బీమా చేసుకుంటున్న రైతులు కొందరైతే... బ్యాంకుల్లో పంట రుణాలతో పాటుగా ప్రీమియంలు చెల్లిస్తున్న వారు ఇంకొందరు. పంట నష్టం జరిగినప్పుడు వీరిలో 90 శాతానికి పైగా క్లెయింలకు నోచుకోవడం లేదు. అసలు పంటల బీమా ఎవరికి అనుకూలంగా ఉంది? రైతులకు లభిస్తున్న ప్రయోజనం ఎంత? బీమా చెల్లింపుల్లో బ్యాంకులు, అధికారుల పాత్ర ఏంటి? ఈ అంశంపై ప్రతిధ్వని చర్చ.