Ganesh immersion in sagar: గంగమ్మ ఒడిలోకి గణపయ్య.. 'సాగర్' వద్ద కోలాహలం - ganesh immersion latest news
🎬 Watch Now: Feature Video
హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనాలు జోరందుకున్నాయి. ఇళ్లలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. గణపతి బప్పా మోరియా.. గణేశ్ మహారాజ్‌కి జై అంటూ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గణపయ్యను గంగమ్మ ఒడిలోకి చేర్చుతున్నారు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది.