Prathidwani: సంక్షోభంలో ఉన్న చేనేతను ఆదుకునే దారేది? - సంక్షోభంలో ఉన్న చేనేతను ఆదుకునే దారేది?
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14035258-715-14035258-1640703812446.jpg)
లక్షలాది కుటుంబాలకు జీవనాధారమైన చేనేత రంగానికి జీఎస్టీ గుదిబండగా మారనుంది. నేత వస్త్రాలపై జీఎస్టీని ఐదు నుంచి పన్నెండు శాతానికి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం నేతన్నల పాలిట మోయలేని భారం కానుంది. జనవరి ఒకటి నుంచి అమలు కానున్న ఈ పన్నుల విధానంపై దేశవ్యాప్తంగా కార్మికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవాల్సింది పోయి... మరింత భారం పెంచడం పట్ల నేతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో చేనేతపై జీఎస్టీ పెంపుదల ప్రభావం ఎంత? స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి ఏంటి? అసలు పన్నుల భారం తప్పించే మార్గాలున్నాయా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.