ప్రతిధ్వని: రైతుల ఆత్మహత్యలకు ముగింపు పలికే మార్గం లేదా?
🎬 Watch Now: Feature Video
ఒక రైతుకు వరి శిక్ష! మరో రైతు నెత్తిన పత్తి కత్తి! ఒకరో ఇద్దరో కాదు. ఈ ఏడాదో... గత ఏడాదో అని కాదు. ఏ రైతును చూసినా... ఏ సంవత్సరం చూసినా.. కష్టమే! సాగు నష్టమే! రైతులు తమ బలాన్ని మాత్రమే కాదు ప్రాణాలనూ పొలానికే అర్పిస్తున్నారు. భూమినే నమ్ముకుని మట్టిలో బంగారు పంటలు పండిస్తున్న రైతు కళ్లల్లో ఆశలు ఆవిరవుతున్నాయి. దిక్కుతోచని స్థితిలో బలవన్మరణం పాలవుతున్నాడు. అసలు ఈ రైతు కష్టం తీరేదెన్నడు? జై జవాన్... జై కిసాన్ అంటూ ఘనమైన నినాదం ఇచ్చిన వ్యవసాయ భారతంలో రైతన్నలకు ఎందుకింత కష్టం? కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు రమేష్ తరహాలో ఇంకా ఎంతమంది సమిధలు కావాలి? ఈ అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Mar 26, 2021, 9:08 PM IST