5 నిమిషాలు.. 4 డ్రెస్సులు.. అదిరిపోయే సొగసులు - ladu gaga
🎬 Watch Now: Feature Video

అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగుతున్న మెట్ గాలా ఈవెంట్లో హాలీవుడ్ హీరోయిన్స్‌తో పాటు ప్రముఖ మోడల్స్ సందడి చేశారు. అమెరికన్ గాయని లేడీ గాగా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పింక్ కార్పెట్‌పై దుస్తులను మారుస్తూ ప్రేక్షకుల మతి పోగొట్టింది.
మొదట భారీ పింక్ గౌన్‌తో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ అనంతరం బ్లాక్ కలర్ దుస్తుల్లో గొడుగుతో ఫొటోలకు ఫోజిచ్చింది. అనంతరం మరోసారి పింక్ దుస్తుల్లో పెద్ద కళ్లద్దాలతో చేతిలో ఫోన్‌తో 90వ దశకం ఫ్యాషన్‌ను గుర్తుకుతెచ్చింది. ఐదు నిమిషాల్లో మొత్తం నాలుగు విభిన్న రకాల డ్రెస్సులతో ఆకట్టుకుంది.