జలపాతంలో కొట్టుకుపోయిన యువకుడు.. రెప్పపాటులోనే కాలు జారి.. - వైరల్ వీడియోలు
🎬 Watch Now: Feature Video
సరదాగా జలపాతన్ని చూడటానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు వరద నీటిలో పడి కొట్టుకుపోయాడు. ఈ దృశ్యాలు మొబైల్లో రికార్డయ్యాయి. కర్ణాటకలోని ఉడిపి జిల్లా కొల్లూర్‌లోని అరశినగుండి జలపాతం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. శివమొగ్గ జిల్లా భద్రావతి ప్రాంతానికి చెందిన శరత్ కుమార్(23) జలపాతాన్ని చూసేందుకు కారులో కొల్లూరుకు వచ్చాడు. జలపాతాన్ని వీక్షించేందుకు అక్కడ ఓ బండపై నిలబడ్డాడు. దీనిని అతడి స్నేహితుడు ఫోనులో వీడియో తీశాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయాడు శరత్. కాలు జారి పడిపోతున్న దృశ్యం మొబైల్లో రికార్డు అయ్యింది. సమాచారం అందుకున్న కొల్లూర్ పీఎస్ఐ జయలక్ష్మి, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. జలపాతంలో కొట్టుకుపోయిన శరత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొల్లుర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.
అదృష్టవశాత్తు రాయిని పట్టుకుని..
కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర ఉస్మానాబాద్‌లో భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో భూమ్ తాలూకాలోని పత్రుడ్లో దుధానా నది ఉద్ధృతంగా ప్రవహించింది. ఆ నది వంతెన దాటుతున్న కాంతిలాల్ అనే బైకర్ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అయితే అదృష్టవశాత్తు ఓ బండరాయిని పట్టుకుని సురక్షితంగా బయటపడ్డాడు. అతడి బైక్ మాత్రం నదిలో కొట్టుకుపోయింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.