Yoga Day special 2023 : 6150 మీటర్లు ఎత్తులో.. మైనస్ 15 డిగ్రీల్లో.. యోగాసనాలు
🎬 Watch Now: Feature Video
Yoga on Mountain video : ఆత్మస్థైర్యం, పట్టుదలతో యువత ముందుకు సాగితే సాధ్యం కానిది ఏం లేదని చెప్పిన స్వామి వివేకానంద మాటలను నిజం చేస్తున్నాడు ఓ యువకుడు. ఏకంగా శిఖరాలపైనే యోగాసనాలు వేసి అందరితోటి మన్ననలు పొందుతున్నాడు. ఆ యువకుడి పేరు మీద చాలా రికార్డులు ఉన్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన ప్రవీణ్ చిన్నతనం నుంచి యోగాసనాలు వేయడం అలవాటుగా నేర్చుకున్నాడు. నేపాల్లోని 6150 మీటర్ల ఎత్తు ఉన్న మేర పర్వతంపై 108 సూర్య నమస్కారాలు చేశాడు.
ఇదే విధంగా శీతల ప్రదేశమైన మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపుపై మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 108 సూర్య నమస్కారాలు చేశాడు. దీంతో పాటు 21 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు పూర్తి చేసి.. ప్రజలను ఆశ్చర్యపరిచాడు. ఇప్పటి వరకు ఈ యువకుడు 8 దేశాల్లో 21 ఎత్తైన పర్వతాలపై 108 సూర్య నమస్కారాలు చేసి.. అందరి మన్ననలు పొందాడు. ప్రస్తుతం యూనివర్సిటీలో యోగా శిక్షకుడిగా పనిచేస్తున్నాడు.