యాదాద్రీశుని 30 రోజుల హుండీ ఆదాయం.. ఎంతో తెలుసా..? - ఈఓ గీత పర్యవేక్షణలో హుండీ లెక్కింపు
🎬 Watch Now: Feature Video

30 days Hundi income of Yadadri Temple: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం 30 రోజుల హుండీ ఆదాయాన్ని కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రత మండప భవనంలో లెక్కించారు. ఆలయ అధికారులు ఇందులో భాగంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి 30 రోజుల హుండీ ఆదాయం అక్షరాల రూ.2 కోట్ల 55 లక్షల 83 వేల 999 చేరుకుంది.
మిశ్రమ బంగారం 91 గ్రాములు, మిశ్రమ వెండి 4 కేజీల 650 గ్రాములు వచ్చింది. ఇకపోతే విదేశీ రూపాయలు.. అమెరికా వెయ్యి 343 డాలర్లు, యూఏఈ 95 దిరామ్స్, ఆస్ట్రేలియా 55 డాలర్స్, కెనడా 140 డాలర్స్, ఒమాన్ 200 బైసా, మలేషియా 10 రింగిట్స్, భూటాన్ 21 నెగటరమ్, క్వార్టర్ 12 రియాల్స్, సింగపూర్ 8 డాలర్లు, ఇంగ్లాండ్ 25 పౌండ్స్, యూరో 60 యూరోస్, వివిధ దేశాల విదేశీ కరెన్సీ భక్తుల ద్వారా ఆలయ ఖజానాకు చేకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయ ఈఓ గీత పర్యవేక్షణలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఇందులో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.