ఓటుకు నోటు ఇవ్వలేదని రోడ్డెక్కిన భద్రాచలం ఓటర్లు

🎬 Watch Now: Feature Video

thumbnail

Voters Demand to Money in Bhadrachalam : రాష్ట్రంలో ఓట్ల కోసం ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. నాయకులు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారు. అయితే కొంతమందికి ఈ డబ్బులు అందడంలేదు. ఈ మేరకు డబ్బుల కోసం ప్రజా ప్రతినిధులను ఓటర్లు నిలదీస్తున్నారు. తమకు ఓటు ఉందని.. డబ్బులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. తమ డబ్బులు తమకు ఇచ్చేందుకు మీకు ఏం నొప్పి వస్తుందంటూ నిలదీస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. 

Telangana Assembly Elections Polling 2023 : భద్రాచలంలోని ఏఎస్​ఆర్ కాలనీలో ఓటుకు నోటు ఇవ్వలేదని ఓటర్లు ఆందోళన చేశారు. అన్ని కాలనీలలో ఓటుకు నోటు పంచిన రాజకీయ నాయకులు తమ కాలనీలో మాత్రం ఓటుకు నోటు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని అందుకే తాము ఓటు వేయమని భీష్మించికు కూర్చున్నారు. ఒక పార్టీ నాయకుడికి ఓటుకు నోటు ఇవ్వమని నగదు అప్పగించినప్పటికీ.. అందరికీ ఇవ్వకుండా కొంతమందికే పంపిణీ చేశారని కాలనీ వాసులు ఆరోపించారు. సుమారు 300 మంది ఓటర్లు ఓటు వేయమంటూ కాలనీ శివారు ప్రాంతంలో ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఒక పార్టీకి చెందిన నాయకులు వారి వద్దకు వెళ్లి బుజ్జగించడంతో ఓటు వేసేందుకు కాలనీవాసులు ఒప్పుకున్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.