పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ను నిర్భందించిన గ్రామస్థులు
🎬 Watch Now: Feature Video
సిద్దిపేట జిల్లా చౌటపల్లి గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. గ్రామసర్పంచిని, మరికొందరి వ్యక్తులను గ్రామపంచాయతీలో నిర్భందించారు. గ్రామస్థులు గ్రామ సర్పంచిని ఎందుకు నిర్భందించారనే సందేహం కలుగుతుంది కదా. ఊరికే కాదు దానికో పెద్ద కారణమే ఉంది. సోమవారం అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాలను హుస్నాబాద్ మండలంలో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దానిలో చౌటపల్లి మండలం లేదు. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్థులు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, భారాస గ్రామ అధ్యక్షులను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి తాళం వేసి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామాన్ని హుస్నాబాద్ మండలంలో కలపాలని డిమాండ్ చేస్తూ గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు. తమ గ్రామాన్ని కూడా హుస్నాబాద్ మండలంలో కలపాలని డిమాండ్ చేస్తూ అక్కన్నపేట వద్దు హుస్నాబాద్ ముద్దు' అంటూ నినాదాలు చేశారు. తమ గ్రామాన్ని హుస్నాబాద్‌లో కలపాలనే కారణంతో గ్రామ సర్పంచిని మరికొందరి వ్యక్తులను గ్రామపంచాయతిలో నిర్భందించి డిమాండ్ చేశారు.