ప్రలోభాలకు లొంగకుండా ప్రతిఒక్కరు నిర్భయంగా ఓటు వేయాలి : వికాస్​రాజ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

Vikas Raj Interview : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ శాంతియుతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌(Vikas Raj) తెలిపారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా.. ప్రతి ఒక్కరు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. 

Vikas Raj Suggestions for Telangana Voters : తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా 35,655 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు(Polling Centers) ఏర్పాటు చేశామని.. పోలింగ్‌కు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని వికాస్‌రాజ్‌ పేర్కొన్నారు. పోలింగ్‌ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేశామని వెల్లడించారు. ఎన్నికల విధుల్లో 1.85 లక్షల మంది పాల్గొననున్నారని చెప్పారు. ఈ సిబ్బంది బుధవారం సాయంత్రంలోపు పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటారని స్పష్టం చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్​ జరుగుతుందని అన్నారు. పోలింగ్​ పరిశీలన కోసం 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లు, స్వ్కాడ్ల నియామకం చేశారని పేర్కొన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌తో ముఖాముఖి.

Last Updated : Nov 29, 2023, 7:27 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.