farmers loss: అకాల వర్షాలు.. అన్నదాతకు తీరని కష్టాలు
🎬 Watch Now: Feature Video
Farmers Loss due to untimely rains: అకాల వర్షాల కారణంగా రైతులు లక్షల్లో నష్టపోతున్నారు. కొనుగోళ్ల కోసం తీసుకొచ్చిన పంట కొనకపోవడంతో ఆ పంట వర్షం పాలయ్యింది. పంట నానిపోవడం వల్ల ఏకంగా వాటికి మొలకలు వచ్చిన పరిస్థితి ఏర్పడింది. తడిసిన పంటను రైతులు ఆరబెడుతున్నా.. తరచూ కురుస్తున్న వర్షాలకు అవి వాడకానికి పనికి రాకుండా పోతున్నాయి. జగిత్యాల జిల్లాలో కురిసిన వర్షాలు అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పంట నష్టంతో రైతులు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయారు. తాజాగా గురువారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో మార్కెట్లో ఆరబోసిన ధాన్యం నీటి పాలైంది.
సకాలంలో ధాన్యం కొనుగోళ్లు జరిగితే తమకు ఈ దుస్థితి వచ్చేది కాదని రైతులు వాపోతున్నారు. వర్షాలు కురుస్తున్నా అధికారులు వచ్చి పంట కొనుగోళ్లు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్ల కోసం తీసుకు వచ్చిన పంటకు కనీసం కాంటలు వేయడం కూడా ప్రారంభించలేదన్నారు. అమ్మడానికి తీసుకువచ్చిన వడ్లన్నీ వర్షానికి తడిసిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.