Kishanreddy: 'ప్రజాధనాన్ని వృథా చేయడం తప్ప సచివాలయంతో ఉపయోగం లేదు' - తెలంగాణ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 30, 2023, 1:23 PM IST

Kishan Reddy Comments on Secretariat: ప్రధాన మంత్రి మన్‌ కీ బాత్‌ 100వ ఎపిసోడ్‌ ఈరోజు ప్రసారం అయింది. సనత్​నగర్​లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నూతన సచివాలయాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవలంభిస్తున్న పద్ధతులను ఆయన విమర్శించారు. సచివాలయం ప్రారంభించే కార్యక్రమానికి కొన్ని మీడియా సంస్థలపై ఆంక్షలు విధించారని.. ఇది ఎంత వరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా సంస్థలకు, టీవీ ఛానళ్లకు విమర్శించే అధికారం ఉంటుందని తెలిపారు. 

కేసీఆర్‌ పార్టీని విమర్శిస్తున్నారనే నెపంతో.. వాటిపై నిబంధనలు పెట్టడం సరైన నిర్ణయం కాదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి చేసిన ఉద్యమంలో మీడియా పాత్ర ఎంతో ఉందని కిషన్​రెడ్డి గుర్తు చేశారు. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవనం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రజాధనాన్ని నిరుపయోగం చేయడం తప్ప.. ప్రగతి భవనం, నూతన సచివాలయం ప్రజలకు ఏ మాత్రం ఉపమోగపడవని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.