Tummala Nageswara Rao Interesting Comments : ఈ ఎన్నికల్లో ఖమ్మం ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలి : తుమ్మల - Telangana Assembly Elections 2023
🎬 Watch Now: Feature Video
Published : Oct 22, 2023, 1:09 PM IST
Tummala Nageswara Rao Interesting Comments in Khammam : రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులను చూస్తే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దురాగతాలు బాగా పెరిగిపోయాయని విమర్శించారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. మున్నేరులో ఈతకొట్టే వారి వద్దకు వెళ్లి కాసేపు మాట్లాడారు. ఖమ్మం నియోజకవర్గం సీటు దాదాపు ఖరారు కావడంతో జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
Telangana Assembly Elections 2023 : రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యేలను అదుపు చేసే శక్తి లేదని తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ప్రజల కోసం కార్యక్రమాలు చేసే శక్తి లేదని విమర్శించారు. అందరూ కలిసి ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. తాను ఏ పార్టీలో ఉన్నా ప్రజల కోసమే పని చేస్తానని చెప్పారు. సోనియా గాంధీ 60 సంవత్సరాల పోరాటాన్ని గుర్తించి తెలంగాణ ఇచ్చిందని.. ఇప్పుడు అది కొద్ది మంది చేతిలో దోపిడీకి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను కాంగ్రెస్‌లో చేరానని.. ఖమ్మం ప్రజలు ఈ ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పును ఇవ్వాలని తుమ్మల నాగేశ్వరరావు కోరారు.