TSRTC : టికెట్లు అమ్మలేదని కండక్టర్ల ఫొటోలతో ఫ్లెక్సీ.. అసలేం జరిగింది? - మేడ్చల్స్ బస్ డిపో కండక్టర్స్
🎬 Watch Now: Feature Video
Medchal Conductors Photos Flexi : ఎవరైనా అత్యంత ప్రతిభ కనబరిస్తే ఫ్లెక్సీలో ఫొటోలు వేసి అభినందిస్తారు. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా టిక్కెట్లు అమ్మలేదని ఆర్టీసీ అధికారులు ఫ్లెక్సీలు వేసి సిబ్బందిని అవమానించారు. ఈ సంఘటన మేడ్చల్ ఆర్టీసీ డిపోలో చోటుచేసుకుంది. ఆర్టీసీ అధికారుల వేధింపుల తారస్థాయికి చేరుకున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఆర్టీసీ సంస్థలో వేధింపులు ఎక్కువ అవుతున్నాయని పదే పదే చెబుతున్నా.. యాజమాన్యం కనీసం పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్లు తక్కువ అమ్ముతున్నారంటూ డిపో తరఫున ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వారిని అవమానించారు. టీఎస్‌ఆర్టీసీలో డబ్బులు రాకపోయినా.. కేఎంపీఎల్, ఎర్నింగ్ ఈపీకే రాకపోయినా.. రోజు మొత్తం ప్రయాణికులకు టికెట్లు అమ్మలేకపోయినా ఈ విధమైన వేధింపులు ఉంటున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ వేధింపులు తాళలేక కొందరు ఆత్మహత్యలు, మరికొందరు మనో వేదనకు గురై.. డ్యూటీ రావడం మానేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే ఆర్టీసీ యాజమాన్యం స్పందించి.. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.