Rain Effect In Telangana : గిరిజనుల వాన కష్టాలు.. ప్రాణాలను పణంగా పెట్టి.. - గిరిజనులు వరద కష్టాలు
🎬 Watch Now: Feature Video

Tribal Villages Affected By Rains In Telangana : భారీ వర్షాల కారణంగా ఏజన్సీ గ్రామ ప్రజల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వర్షాల కారణంగా వాగులు ఉప్పొంగిపోవడంతో.. రెండు, మూడు రోజులు నుంచి గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కనీసం వైద్య సౌకర్యం పొందేందుకు కూడా నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీతారాంపురం గిరిజన గ్రామ వాసులు వర్షం పడితే చాలు నరకమే వారికి. ఆ గ్రామ సమీపంలో ఉన్న వాగు గత రెండు రోజుల నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చిన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగు దాటి రావాల్సిందే.
ఈ క్రమంలో అదే గ్రామంలో కురుసం సిద్ధు అనే గిరిజనుడికి వాంతులు, విరేచనాలు, జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. దీంతో చేసేదేమీ లేక అతని బంధువులు జెడ్డీ(జోలె) కట్టి.. జ్వర బాధితుడిని అతికష్టం మీద వాగు దాటించి ఆస్పత్రిలో చేర్పించారు. మరోవైపు అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఇదే సమస్యతో నేడు మృతి చెందాడు.