PRATHIDWANI: ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని దాటేదెలా..? అందుకోసం ఏ సంస్కరణలు తేవాలి..? - హైదరాబాద్లో ట్రాపిక్పై ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
PRATHIDWANI: సగటు హైదరాబాదీకి చుక్కలు చూపిస్తోంది ట్రాఫిక్ పద్మవ్యూహం. పది, ఇరవై నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్యస్థానాలకు కూడా గంటకు పైగా సమయం పడుతోంది ఒక్కొక్కసారి. కొద్ది రోజులుగా ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతూనే ఉంది. మెట్రో, ఎస్‌ఆర్‌డీపీ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నా ఎందుకింత అవస్థలన్నదే అందరిలో మెదులుతున్న ప్రశ్న. అసలు హైదరాబాద్ నగర ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న చిక్కులకు ప్రధాన కారణాలు ఏమిటి? వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 14, 2023, 11:34 AM IST