తండ్రి బ్యానర్లో ట్విన్స్ 'తికమక తాండ'-ఆ ఊరంతా మతిమరుపే- థియేటర్లలో నవ్వులే నవ్వులు! - తికమక తాండ సినిమా హీరోయిన్
🎬 Watch Now: Feature Video
Published : Dec 14, 2023, 7:15 PM IST
Thikamaka Thanda Actors Interview : ఆ కుర్రాళ్లిద్దరు కవల పిల్లలుగా జన్మించారు. పెరిగి పెద్దవుతూ వెండితెరపై హీరోలుగా కనిపించాలని కల కన్నారు. సక్సెస్ సాధించడం కలలు కన్నంత సులువు కాదని ఎదుగుతున్నా కొద్ది వారికి అర్థమైంది. ఎన్ని కష్టాలొచ్చినా ఎక్కడా వెనుకడుగు వేయలేదు. సినీ పరిశ్రమ నుంచి ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారు. చివరకు ఆ కవల సోదరుల కష్టాన్ని చూసిన తండ్రి వారిని ప్రోత్సహించాడు. తనే సొంత నిర్మాణ సంస్థను స్థాపించి కుమారులిద్దరికీ కెరీర్లో ఎదిగేందుకు ఛాన్స్ ఇచ్చాడు. ఆ సోదరులే విజయవాడకు చెందిన రామకృష్ణ-హరికృష్ణ. 'మనం' చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసిన వెంకట్ దర్శకత్వంలో 'తికమక తండా' చిత్రం తెరకెక్కింది. డైరెక్టర్ వెంకట్ ఈ సినిమాను 1990 నేపథ్యంలో సాగే కథ ఆధారంగా రూపొందించారు. ఇక ఈ చిత్రంతో కవలలు రామకృష్ణ-హరికృష్ణ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో 'రాజన్న' ఫేమ్ నటి అని (మల్లిక) కీలక పాత్ర పోషించింది. డిసెంబర్ 15న 'తికమక తాండ' థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.