Theft at Car Showroom in Nalgonda : కారు షోరూమ్‌లలో నగదు చోరీ.. వీడియో వైరల్ - Theft at Nalgonda Hyundai Showroom
🎬 Watch Now: Feature Video
Theft at Hyundai Ford Showroom in Nalgonda : నల్గొండ జిల్లాలో ఇటీవల కాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వరుస చోరీలు జిల్లా ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పోలీసులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా.. ఎక్కడో చోట రోజూ చోరీలు జరుగుతూనే ఉన్నాయి. తాళాలు వేసిన ఇళ్ల తాళం పగులగొట్టి మరీ చోరీలు చేస్తున్నారు దొంగలు. ఇళ్లే కాదు ఆఫీసులు, దుకాణాలు.. ఇలా దేన్నీ వదలడం లేదు. తాజాగా కారు షోరూమ్‌లో దొంగలు పడ్డారు. నల్గొండ జిల్లా కేంద్రంలో అద్దంకి బైపాస్ రోడ్డులో ఉన్న హ్యూందాయ్ షోరూమ్, ఫోర్డ్ షోరూంలో గుర్తుతెలియని ముగ్గురు దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. దాదాపు రూ.5 లక్షలకు పైగా సొమ్మును దోచుకెళ్లారు.
నల్గొండ రూరల్ ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హ్యూందాయ్, ఫోర్డ్ షోరూంలలో పనిచేసే సిబ్బంది రోజు మాదిరిగానే సోమవారం రాత్రి పది గంటల ప్రాంతంలో షోరూమ్ షట్టర్ మూసివేసి ఇళ్లకు వెళ్లారు. అది గమనించిన ముగ్గురు దుండగులు సెక్యూరిటీ గార్డుల కళ్ళు కప్పి వెనుక భాగం నుంచి షోరూమ్‌లోకి ప్రవేశించారు. ముఖాలకు మాస్కులు కట్టుకుని షోరూమ్‌లో కలియ తిరిగారు. లాకర్లు తెరవడానికి సంబంధించిన వస్తువులను వెంట తెచ్చుకున్నారు. వాటిని ఉపయోగించి డబ్బును ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్టు అయ్యాయి. దాదాపు రూ.5 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు షోరూమ్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.