Mobiles robbery in Adilabad : మొబైల్ షాప్లో దొంగతనానికి పాల్పడ్డ గుర్తు తెలియని వ్యక్తులు - Adilabad Mobile Robbery case
🎬 Watch Now: Feature Video
Recorded CC Camera mobiles robbery in Adilabad : ఆదిలాబాద్ పట్టణంలోని ఒక సెల్ ఫోన్ షాపులో వరుసగా రెండుసార్లు గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. పట్టణంలోని సినిమా రోడ్డు వద్ద గల ఆపిల్ మొబైల్ స్టోర్లో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు షాపులో చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి. చరవాణీల దుకాణం పైకప్పు రేకులను తొలగించి దుకాణంలోకి ముగ్గురు వ్యక్తులు చొరబడి ఆపిల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. వీటి విలువ మొత్తం రూ. రెండు లక్షలకు పైగా ఉంటుందని షాపు యజమాని పేర్కొన్నారు. దీనిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాగే మొబైల్ దుకాణంలో చోరీ జరగిందని.. అప్పుడు రూ. లక్ష యాభై వేల రూపాయలు విలువ గల ఫోన్లు ఎత్తుకెళ్లారని తెలిపారు. ఇప్పటి వరకు ఆ దొంగలను పట్టుకోలేదని ఇప్పటికైనా పోలీసులు చొరవ తీసుకొని దొంగల్ని పట్టుకోవాలని షాపు యాజమాని కోరారు.