Harishrao on RuthuPrema : "వ్యక్తిగత పరిశుభ్రతతోనే.. ఆరోగ్య తెలంగాణ సాధ్యం" - రుతుప్రేమ అవగాహన కార్యక్రమం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 23, 2023, 4:43 PM IST

Harish Rao in Menstruation Awareness Programme : రుతుచక్రం లేకుంటే జీవనచక్రం లేదని.. మనిషి మనుగడకు మూల కారణం రుతుచక్రమని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలోని 30, 31వ వార్డుల్లో రుతుప్రేమ పేరుతో.. యువతులకు, మహిళలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించి.. రుతుస్రావ కప్పులు, ప్యాడ్స్ పంపిణీ చేశారు. కుటుంబంగా కలిసి పనిచేస్తే ఎందులోనైనా  అద్భుతాలు సృష్టించవచ్చు. ఓట్ల కోసమో, రాజకీయం కోసమో కాదని హరీశ్​రావు స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ దేశాల్లో మెన్​స్ట్రువల్ కప్పులు వాడుతున్నారని.. సిద్దిపేట  ఆడపడుచులంతా ఆరోగ్యంగా ఉండాలనే తపనతో ఈ రుతుప్రేమ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రజలంతా అనారోగ్యం పాలు కాకుండా..  ఆరోగ్యంగా బతికితేనే "ఆరోగ్య తెలంగాణ" అవుతుందన్నారు.  ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంపై దృష్టిసారించి పలు పథకాలను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. నేడు సిద్ధిపేటను "స్వచ్ఛ సిద్దిపేట"గా మార్చుకున్నామన్నారు. నేడు రాష్ట్రంలో సిద్ధిపేటకు అభివృద్ధిలో ప్రత్యేక పేరుందని.. ఈ అభివృద్ధికి ముఖ్యకారణం ఇక్కడి ప్రజలేనని తెలిపారు. ఈకార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గరిమా అగర్వాల్, సీపీ శ్వేత తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.