Temperature rises in Telangana : 'ఎండలు మండుతున్నాయ్.. జర జాగ్రత్త' - ఈరోజు ఉష్ణోగ్రతలు
🎬 Watch Now: Feature Video
Temperature rises in Telangana Today : భానుడు భగభగలతో మంట పుట్టిస్తున్నాడు. మండే ఎండలతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. సూర్యుడి సెగ తట్టుకోలేక రోజు చాలా మంది వడదెబ్బకు గురవుతున్నారు. వారం రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాదాపు 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది.
రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఎండలు మరింత దంచికొట్టనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మే 31 వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పారు. పిల్లలు, వృద్దులు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు.
దాహం అనిపించకపోయినా ప్రతి రెండు గంటలకు ఒకసారి మంచి నీళ్లు తాగాలని వైద్యులు తెలిపారు. వీలైనంత వరకు ఈ రెండు వారాలు ఇంట్లోనే ఉండాలని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వడదెబ్బ బాధితుల కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది..? మండుటెండల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలన్న విషయాలపై ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావుతో ముఖాముఖి.