బీఆర్ఎస్​ పార్టీలో చేరిన రాష్ట్ర జన జాగృతి ఫోరం అధ్యక్షురాలు - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2023, 9:09 PM IST

Telangana Jana Jagruthi Forum President joins in BRS : రాష్ట్ర జన జాగృతి ఫోరం అధ్యక్షురాలు కోటగిరి ఉషారాణి నిన్న కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు ఆకర్షితురాలై బీఆర్ఎస్​ పార్టీలో చేరానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని అన్నారు.

ఈ పథకాలు పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని కోటగిరి ఉషారాణి చెప్పారు. గత పది సంవత్సరాలలో హైదరాబాద్​తో పాటు రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెడుతున్న రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. బీఆర్ఎస్​ పార్టీ గెలుపుకై ఎల్బీనగర్​తోపాటు రాష్ట్రవ్యాప్తంగా శాయశక్తులా కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో తన కమిటీ సభ్యులంతా కారు గుర్తుకే ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.