Telangana Decade Celebrations 2023 : విద్యుత్ వెలుగుల్లో జిగేల్మనిపిస్తోన్న అమరవీరుల స్మారకం - where is Telangana Martyrs Memorial inauguration
🎬 Watch Now: Feature Video
Telangana Martyrs Memorial Inauguration : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ ఆవిర్భవించి తొమ్మిదేళ్ల నుంచి పదేళ్ల వడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రభుత్వం ఇక్కడి కట్టడాలకు విద్యుత్ వెలుగులు, నూతన రూపురేఖలను తీసుకుస్తోంది. అందులో భాగంగా తెలంగాణ అమరవీరుల స్మారకం వెలిగిపోతోంది. ఈ నెల 22వ తేదీన ప్రారంభోత్సవం నేపథ్యంలో స్మారకానికి, ప్రాంగణానికి రంగు రంగుల విద్యుత్ దీపాలు అమర్చారు. లాన్స్, ఫౌంటెయిన్స్, తదితర ప్రాంతాల్లో ఆకర్షణీయంగా ఉండేలా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. అసలే స్టెయిన్ లెస్ స్టీల్ కట్టడం కావడంతో.. దీపాల కాంతులు మరింతగా వెలిగిపోతున్నాయి. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇప్పటికే సచివాలయం, బీఆర్కే భవన్లు విద్యుత్ కాంతులతో ధగధగలాడుతున్నాయి.తాజాగా అమరుల స్మారకానికి వెలుగులు అద్దడంతో ఆ ప్రాంతం అంతా కాంతులీనుతోంది. అమర వీరుల స్తూపం అచ్చం దీపం వెలిగిటట్లు అమర్చారు. అన్ని వేళలా వెలిగేలా రూపొందించారు. ఒక వైపు తెలుగు మీగడ లాంటీ సౌందర్య భవనం సచివాలయం.. మరో వైపు నగరం ప్రతి బింబం తనలో చూపే అమరవీరుల స్తూపంతో తెలంగాణ కీర్తి ఆకాశ వీధుల్లో విహరిస్తోంది.