Telangana Chief Electoral Officer Vikas Raj Interview : 'ఎన్నికల్లో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా చూస్తాం' - తెలంగాణ ఎన్నికలపై చర్చ
🎬 Watch Now: Feature Video
Published : Oct 14, 2023, 9:30 AM IST
Telangana Chief Electoral Officer Vikas Raj Interview : ఎన్నికల్లో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా చుడాలన్నదే కేంద్ర ఎన్నికల సంఘం ఉద్దేశమని, అందుకు అనుగుణంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్(Vikas Raj) తెలిపారు. డిజిటల్ చెల్లింపులపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే ఈసీ పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేసిందని, వస్తున్న సమాచారం ఆధారంగా ఇతర అధికారుల విషయంలో నిర్ణయాలు ఉంటాయని అన్నారు.
New Voter Card Distribute in Telangana : ఓటరు అవగాహన కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సీఈఓ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. కొత్త ఓటర్లకు త్వరలోనే గుర్తింపు కార్డు(Voter ID)లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇంటి దగ్గర ఓటు వేయాలనుకునే వారు బీఎల్ఓ నుంచి 12డీ ఫారం తీసుకొని వివరాలు నమోదు చేయాలని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. రాష్ట్రానికి ఈ నెల 20 వరకు కేంద్ర బలగాలు వస్తాయంటున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(Chief Electoral Office) వికాస్‌రాజ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.