Shakila Reddy comments on home minister : 'మహిళలు ఎలాంటి వస్త్రాలు ధరించాలో హోం మంత్రి ఎలా చెబుతారు' - Bharat Rashtra Samithi PARTY
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-06-2023/640-480-18792751-209-18792751-1687184225715.jpg)
Home Minister comments on women dress : మహిళల వస్త్రధారణకు సంబంధించి హోం మంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు షకీలా రెడ్డి తీవ్రంగా ఖండించారు. పొట్టి దుస్తువులు ధరించటం ఇబ్బందులకు గురిచేస్తుందంటూ ఓ కార్యక్రమంలో హోం మంత్రి ప్రస్తావించటాన్ని తప్పు బట్టారు. బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్న వారు సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేయటం బాధాకరమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చర్యలు తీసుకోవటం మానేసి మహిళలు పొట్టి దుస్తులు వేసుకుంటే ఇబ్బందులు వస్తాయనటం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమన్నారు. మహిళలు ఎలాంటి వస్త్రాలు ధరించాలో హోం మంత్రి ఎలా చెబుతారని షకీలా రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై నమోదవుతున్న కేసుల్లో కేవలం 2 శాతం మాత్రమే న్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హోం మంత్రి హోదాలో ఉన్న మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలు తప్పుడు సంకేతాలు ఇస్తున్నాయని వాటిని ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు..