బెల్జియంలో ఘనంగా శ్రీరామనవమి సంబురాలు.. - శ్రీరామ నవమి వేడుకలు
🎬 Watch Now: Feature Video
Sri Ramanavami Celebrations In Belgium: జై శ్రీరామ్.. జై శ్రీరామ్ మధురానుభూతిని గొలిపే నామస్మరణం ఖండాంతరాలను దాటింది. శ్రీరామునికి ఎల్లలు లేవు.. విశ్వమంతా జగదభిరాముడునే ఉంటాడు. శ్రీ సీతారాముల కల్యాణం లోకమంతా ఎంతో ఉత్సాహంతో, భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అయితే బెల్జియంలో కూడా ఘనంగానే శ్రీరామ నవమి వేడుకలు జరిగాయి. వరుసగా రెండో ఏడాది కూడా శ్రీ సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆత్మారాముని కల్యాణానికి బెల్జియం, నెదర్లాండ్స్.. లక్సెంబర్గ్ దేశాల నుంచి సుమారు 400 మంది భారతీయులు హాజరయ్యారు. భక్తిశ్రద్ధలతో శ్రీరాముని కల్యాణాన్ని చేసుకొని.. కరుణామయిని ఆశీస్సులు పొందారు.
అసలు శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఎందుకు చేస్తారు.. వాటిలో ఘట్టాలు ఎలా ఉంటాయి. వాటి నుంచి ఒక మనిషి ఏం నేర్చుకోవచ్చు.. భారతీయుల సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసేందుకు గత ఏడాది నుంచి బెల్జియంలో బెనెలక్స్ సీజన్స్.. అకేషన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సింగంశెట్టి శ్రీసాగర్ ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. మాతృభూమికి దూరంగా ఉంటున్న భారతీయ యువత తమ సంప్రదాయాలను మరిచిపోకుండా ఉండేందుకు ఇదే సరైన మార్గమని ఆయన చెప్పారు. భారతీయ పండుగలు జరుపుకోవడం ద్వారా బెల్జియం, నెదర్లాండ్స్ మరియు లక్సెంబర్గ్‌లోని నివసిస్తున్న భారతీయ కమ్యూనిటీలు కలుసుకుంటున్నామని తెలిపారు.