Sitara And Namrata Attended a Program in Hyderabad : హైదరాబాద్‌లో సందడి చేసిన సితార, నమ్రత - నెక్సాస్ మాల్‌లోని కార్యక్రమంలో పాల్గొన్న నమ్రత
🎬 Watch Now: Feature Video
Published : Sep 30, 2023, 9:57 PM IST
Sitara And Namrata Attended a Program in Hyderabad : సూపర్ స్టార్ మహేశ్‌బాబు కుమార్తె సితార, భార్య నమ్రత హైదరాబాద్‌లో సందడి చేశారు. కూకట్‌పల్లిలో వస్త్ర రంగంలో రాణిస్తోన్న ఓ స్టోర్‌లో బొమ్మల కొలువు పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సితార, నమ్రత వృద్ధులకు, చిన్నారులకు వస్త్రాలను అందజేశారు. సితార అక్కడున్న పిల్లలతో కాసేపు ముచ్చటించారు.
కొంతమంది ఫ్యాన్స్ సితారతో సెల్ఫీలు తీసుకున్నారు. మహేశ్‌బాబు సతీమణి నమ్రత ఫ్యాషన్ గురించి మాట్లాడారు. మాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైనందుకు ఆనందంగా ఉందని సితార అన్నారు. కాగా సితార సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. చిన్న వయస్సులోనే చిట్టి చిట్టి మాటలతో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ స్టార్‌డమ్ క్రియేట్ చేసుకుంది. ఇన్‌స్టాలో వీడియోలు, రీల్స్ చేస్తూ తన ఫాన్స్‌ను అలరిస్తుంది. ఇటీవల ఓ ప్రముఖ జ్యువెల్లరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేసింది.