Silencers Destroy in Warangal : బైక్ సైలెన్సర్లు ధ్వంసం చేసిన ట్రాఫిక్ పోలీసులు.. ఇకపై సౌండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు - traffic police action on bikes
🎬 Watch Now: Feature Video
Silencers Destroy in Warangal : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్ధం చేసే సైలెన్సర్లను హనుమకొండ కేయూ క్రాస్ రోడ్డు వద్ద రోడ్ రోలర్‌తో ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేసారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ అదేశాల మేరకు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రై సిటీ పరిధిలో కొన్ని రోజులుగా ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనిలో భాగంలో అధిక శబ్ధం వచ్చే ద్విచక్ర వాహనాలను గుర్తించి.. వాటి సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. వాటినన్నింటిని మరోసారి వినియోగించకుండా రోడ్ రోలర్‌తో ధ్వంసం చేశారు. సుమారు రెండు వందలకు పైగా సైలెన్సర్లను(Destroying Silencers) తొక్కించారు. అందులో హనుమకొండకి చెందినవి 70, కాజీపేట 65, వరంగల్ 65 ఉన్నాయని తెలిపారు. అధిక శబ్ధాలు వచ్చే సైలెన్సర్ల వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసినా.. వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.