Shop Owner Variety Flexi about Alcohol : 'ఇది బెల్ట్ షాపు కాదు.. ఇక్కడ మద్యం విక్రయించరు' - Cool Drink Shop Owner Variety Flexi in Motkur

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 22, 2023, 7:37 PM IST

Cool Drink Shop Owner Variety Flexi in Yadadri Bhuvanagiri : మద్యం ప్రియుల తాకిడి తట్టుకోలేక.. ఏకంగా ఓ కూల్ డ్రింక్​ షాపు యజమాని తన దుకాణం ముందు వింతగా ఫ్లెక్సీ పెట్టాడు. అందులో 'ఇది బెల్ట్​ షాపు కాదు. ఇక్కడ మద్యం విక్రయించరు' అని రాశాడు. ఈ విషయం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో నాలుగు మద్యం దుకాణాలు ఉన్నాయి. ప్రభుత్వం అనుమతి లేకున్నా.. పట్టణంలోని చెరువుకట్ట, బస్టాండ్​ తదితరి ప్రాంతాల్లో విచ్చలవిడిగా బెల్ట్​ షాపులను నడుపుతున్నారు. కూల్​ డ్రింక్​, చిన్న చిన్న కిరాణ దుకాణాలు వాటికిి అడ్డాగా మారాయి. ఈ షాపులపై స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అబ్కారీ శాఖ అధికారులు పట్టించకోలేదన్న ఆరోపణలు ఉన్నాయని పట్టణవాసులు చెబుతున్నారు. 

ఈ క్రమంలోనే నగరంలో ఓ కూల్​ డ్రింక్​ షాపునకు తరచుగా మద్యం ప్రియులు వచ్చి మద్యం దొరుకుతుందా అని అడుగుతున్నందున ఆ యజమాని విసిగిపోయి.. తన షాపు ముందు ఈ ఫ్లెక్సీని పెట్టుకున్నాడు. ఇకనైనా అబ్కారీ శాఖ వారు స్పందించి మద్యంపై సరైన నియంత్రణ తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.