Shabbir Ali on KCR over Kamareddy Constituency : కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి ఖాయం : షబ్బీర్ అలీ - Congress latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 21, 2023, 5:19 PM IST

Shabbir Ali on BRS Kamareddy Constituency : కేసీఆర్ తన రాజకీయచరిత్రలో ఓ పెద్ద పొరపాటు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీమంత్రి షబ్బీర్‌ అలీ వ్యాఖ్యానించారు. కామారెడ్డిలో పోటీ చేస్తానని కేసీఆర్ ప్రకటనపై ఆయన స్పందించారు. కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి ఖాయమన్నారు. తాను కామారెడ్డి గడ్డపై పుట్టిన వ్యక్తినని ఇక్కడి ప్రజలపై తనకు విశ్వాసం ఉందని.. కేసీఆర్‌ను తప్పకుండా ఓడిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కామారెడ్డి, గజ్వే​ల్​లో ఎక్కడ గెలువరని.. రెండు చోట్ల ప్రజలు ఓడించి ఇంటికి పంపుతారన్నారు. కామారెడ్డి అభివృద్దికి సీఎం కేసీఆర్ చేసిందేమిలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని.. కేసీఆర్‌ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి చేయలేదని విమర్శించారు. కనీసం మైనార్టీ విభాగాన్ని బలోపేతం చెయ్యలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ కమిటీకి ఛైర్మన్‌గా తనను నియమించారని.. ముస్లిం డెవలప్‌మెంట్‌ వక్ఫ్‌బోర్డు భూముల పరిరక్షణ కోసం ఏం చేయాలనే అంశాలపై.. కమిటీ సభ్యులతో చర్చించినట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.