School Bus Accident in Sultanpur Today : కుంటలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. అందులో 40 మంది విద్యార్థులు - school bus accidents
🎬 Watch Now: Feature Video
Published : Sep 23, 2023, 11:19 AM IST
School Bus Accident in Sultanpur Today : వికారాబాద్ జిల్లాలో స్కూల్ బస్సుకు(school bus accident) త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ రోజు ఉదయం పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు.. అదుపుతప్పి సుల్తాన్పూర్ కుంటలోకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా పిల్లలు భయాందోళనకు గురై బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి.. వారిని రక్షించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నారు.
School Bus Accident in Vikarabad: ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కుంటలోకి వెళ్లకుండా కట్టపైన ఆగడంతో.. పెద్ద గండం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు. బస్సు స్టీరింగ్ పని చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపాడు. వెంట్రుక వాసిలో పెను ప్రమాదం తప్పిందని లేదంటే విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవాని.. పాఠశాల యాజమాన్యంపై స్థానికులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి ఫిట్నెస్ లేని బస్సులను నడుపిస్తూ.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు. ఇటుంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వాన్ని కోరుతున్నారు.