దిల్లీ పబ్లిక్​ స్కూల్​ క్యాంపస్​లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు - ఆటపాటలతో ఆకట్టుకున్న విద్యార్థులు - Delhi public school hyderabad

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2024, 10:46 PM IST

School Annual Day Celebrations : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ మండలం జాఫర్​గూడలో దిల్లీ పబ్లిక్​ స్కూల్​ క్యాంపస్​లో వార్షికోత్సవ వేడుకలు​ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ధారసింగ్ నాయక్, డీపీఎస్ స్కూల్ స్పోక్ ఛైర్ పర్సన్ విజయ నిర్మల, సీఈవో అఖిల, సెక్రటరీ కృష్ణారావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో ఆకట్టుకున్నారు.

Delhi Public School Annual Day : ఈ సందర్భంగా వక్తలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యతో పాటు, నైతిక విలువలు, వినయ విధేయతలు కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న విద్యార్థుల మనస్తత్వాలను జాగృతి పరిచే దిశగా సెలబ్రేషన్స్ నిర్వహించామని పాఠశాల యాజమాన్యం తెలిపారు. ఈ క్రమంలో చదువు, ఆటలు, సాంస్కృతిక కళలో విద్యార్థులు సాధించిన విజయాలపై వార్షిక నివేదికను ప్రవేశపెట్టి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.