car accident in Vasasthalipuram : వనస్థలిపురంలో కారు ప్రమాదం.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు - వనస్థలిపురం కారు ప్రమాదం సీసీటీవీలో రికార్డు
🎬 Watch Now: Feature Video
car accident in Vasasthalipuram అతివేగం ఎల్లవేళలా ప్రమాదకరమే. దీనివల్ల ఎటా పెద్దసంఖ్యలో రోడ్డుప్రమాదాలు జరిగుతున్నాయి. చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోడ్డుప్రమాదాలు నివారణకు ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ప్రతి సంవత్సరం ఎన్నో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అతివేగంగా వెళ్లినవారికి ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు సైతం విధిస్తున్నారు. అయినప్పటికీ కొందరు అతివేగంగా వెళ్లి తమ ప్రాణాలు కోల్పోవడమే కాకుండా.. ఇతరుల ప్రాణాలను బలిగొంటున్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడమే ఊరట. వనస్థలిపురం సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీలో వేగంగా వెళ్తున్న కారు.. రోడ్డు మీద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి ఢీకొట్టింది. అదే వేగంతో ప్రక్కన ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. దీంతో హోటల్ పాక్షికంగా ధ్వంసం అయింది. బైక్పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో.. స్థానికులు దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.