పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు - బోగి మంటల మధ్య విద్యార్థుల నృత్యాలు
🎬 Watch Now: Feature Video
Published : Jan 13, 2024, 12:42 PM IST
Sankranti Celebrations At Rishi Euro Kids School : తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. చిన్నాపెద్దా అంతా కలిసి రంగవల్లులు, పిండివంటలు, ఆటపాటలతో సంప్రదాయ దుస్తులు ధరించి ఎంతో ఉత్సాహంగా సంక్రాంతిని నిర్వహిస్తారు. చాలామంది సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ అనే అనుకుంటారు. ఆ మూడు రోజుల పాటు సంబరాలు జరుపుకొంటారు. అయితే ఇటీవల కాలంలో పాఠశాలలు, కార్యాలయాలు ఇలా చాలా చోట్ల ముందస్తు సంక్రాంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు.
Rishi Euro Kids School Children Sankranti Sambaralu : తాజాగా ఉప్పల్లోని రిషి యూరో కిడ్స్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింబిస్తూ విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో చక్కగా అలంకరించుకొని పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బొమ్మల కొలువు, రంగవల్లికల మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి ఉపాధ్యాయులతో కలిసి ఆడి పాడారు బోగి మంటల వేసి చుట్టూ నృత్యాలు చేశారు. విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మన పండుగల సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకుంటారని పాఠశాల ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి తెలిపారు.