Sabitha IndraReddy on TS Police : 'తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్ వన్' - టీఎస్ పోలీస్ దేశంలోనే నంబర్ వన్ అన్న సబితా
🎬 Watch Now: Feature Video
Sabitha IndraReddy Started Telangana 5K RUN : రాష్ట్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగాంగా ఈరోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మీర్పేట్ పోలీసులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5కే రన్‌ను.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్లో పెద్దఎత్తున యువతీ యువకులు పాల్గొన్నారు. తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్ వన్ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సమాజంలో పోలీసులు పాత్ర చాలా గొప్పదని.. శాంతి భద్రతల పరిరక్షణలో వారి సేవలు ప్రశంసనీయమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని పోలీసులకు నూతన వాహనాలు, సౌకర్యాలు కల్పిస్తున్నారని వివరించారు. ఈ క్రమంలోనే మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. మరోవైపు సామాజిక కార్యక్రమాల్లో యువత ముందుకు రావాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు.