ఒక్కసారిగా ఊడిన ఆర్టీసీ బస్సు వెనక టైర్లు - తప్పిన పెను ప్రమాదం - హన్మకొండలో ఆర్టీసీ బస్సు ప్రమాదం వార్త

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2023, 5:17 PM IST

RTC Bus Accident in Hanamkonda : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. హుజూరాబాద్ నుంచి హనుమకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక టైర్లు అకస్మాత్తుగా ఊడిపోయాయి. దీంతో బస్సులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఓవర్‌లోడ్‌ కారణంగానే టైర్లు ఊడిపోయినట్లు బస్‌ డ్రైవర్‌ తెలిపాడు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. 

RTC Bus Tyre Came Out When Bus Running : ఆర్టీసీ బస్సు రన్నింగ్​లో ఉండగానే ఒక్కసారిగా వెనక ఉన్న టైర్లు ఊడిపోయాయి. దీంతో బస్సు వెనక భాగం ఒక్కసారిగా కిందకు ఒంగిపోయింది. ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 55 మంది ప్రయాణించాల్సిన బస్సు, 80 మంది ప్రయాణికులతో ఓవర్ లోడ్​తో వెళ్లడమే కారణమని ప్రయాణికులు, స్థానికులు తెలిపారు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం, ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ రవాణా వ్యవస్థలో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.