Road Accident In Bhadradri Kothagudem : ఇంట్లోకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ - Road Accident In Bhadradri Kothagudem District
🎬 Watch Now: Feature Video

Road Accident In Bhadradri Kothagudem : రాష్ట్రంలో రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. తాగి, వేగంగా వాహనాలు నడపరాదు అని అధికారులు ఎన్ని సార్లు చెప్పినా పట్టించు కోకుండా అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంతో అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలలో గాయాల కన్నా ప్రాణ నష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్న అవతలి వాళ్ల నిర్లక్షం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొరంపల్లి బంజర గ్రామంలో జరిగింది. గ్రామంలోని ప్రధాన రహదారి పై నుంచి వెళ్తున్న టిప్పర్ లారీ అదుపుతప్పి ఆనంద్ అనే వ్యక్తి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తలకి గాయాలు కాగా క్లీనర్ రెండుకాళ్లు విరిగాయి. వారిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. రోడ్డుపై వెళ్తున్న లారీ ఒక్కసారిగా ఇంట్లోకి దూసుకెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.