ఫుట్బాల్ ఆడిన రేవంత్ రెడ్డి.. వీడియో వైరల్ - Telangana latest news
🎬 Watch Now: Feature Video
Revanth reddy played Football in Padayatra : హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో ఫుట్బాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి స్వర్గీయ ఆర్గుల్ రాజారామ్ మెమోరియల్ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీని ప్రారంభించిన రేవంత్‌రెడ్డి ,క ఫూట్బాల్ ఆడారు. క్రీడా స్ఫూర్తిని చాటాలని సూచించారు. అక్కడున్న క్రీడాకారులతో కాసేపు ముచ్చటించారు.
Revanth Reddy Padayatra in Nizamabad: రాష్ట్రంలో ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా రేవంత్‌రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ములుగు జిల్లా జిల్లాలో పాదయాత్ర చేపట్టారు. మేడారం సమ్మక్క సారలమ్మ దేవస్థానం నుంచి పాదయాత్ర ప్రారంభం అయ్యింది.ఆరు నెలలపాటు పూర్తిగా జనంలోనే ఉండనున్న రేవంత్‌రెడ్డి.. అందుకు తగ్గట్లు ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు.ఈ యాత్రలో స్థానిక ముఖ్య నాయకులు కలిసి పాదయాత్రలో పాల్గొంటున్నారు.
TAGGED:
ఫుట్ బాల్ ఆడిన రేవంత్ రెడ్డి