తారు డబ్బాలో పడ్డ పాము- రెండు రోజులు శ్రమించి కాపాడిన స్నేక్ క్యాచర్
🎬 Watch Now: Feature Video
Published : Dec 21, 2023, 8:16 PM IST
Rescue of Cobra Trapped in Dambar : తారులో పడి చావుబతుకుల మధ్య ఉన్న ఓ నాగుపామును 2 రోజుల పాటు శ్రమించి రక్షించాడు ఓ స్నేక్ క్యాచర్. ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడం వల్ల సోషల్ మీడియాలో పలువురు అభినందిస్తున్నారు.
ఇదీ జరిగింది
పుత్తూర్‌లోని ఓ ఇంట్లో నాగుపాము దూరిందంటూ తేజస్ అనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం వచ్చింది. తేజస్ అక్కడకు చేరుకొని పాము కోసం వెతకగా అది తప్పించుకుని వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే అక్కడ నిల్వ ఉంచిన డాంబర్ క్యాన్‌లో మరో పాము కనిపించింది. వెంటనే డాంబర్‌తో నిండిన ఆ క్యాన్‌ను తేజస్ తన వెంట తీసుకెళ్లి సహాయక చర్యలు ప్రారంభించాడు. పాముకు గాయాలు కాకుండా జాగ్రత్త పడ్డాడు. బయటకు తీసిన సర్పాన్ని కొబ్బరి నూనెలో ఒక రోజంతా ఉంచాడు. ఆ తర్వాత పాము చర్మం నుంచి తారును తొలగించాడు. అనంతరం సుమారు ఏడాది వయసున్న పామును సురక్షితమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. పాము చర్మం స్వల్పంగా పోయిందని, త్వరలోనే వస్తుందని ఎలాంటి ప్రమాదం లేదని తేజస్ తెలిపారు.