భవిష్యత్ ప్రాంతీయ పార్టీలదేనా? - Regional Parties Role in politics
🎬 Watch Now: Feature Video


Published : Nov 6, 2023, 9:24 PM IST
Regional Parties Future in India : ప్రాంతీయ పార్టీలు... తమ అస్థిత్వం చాటుకునేందుకు ప్రారంభమై., రాజకీయ పార్టీలుగా తమదైన శైలిలో ముందుకెళ్తుంటాయి. అయితే బీజేపీ, కాంగ్రెస్ లాంటి బలమైన జాతీయ పార్టీలతో తలపడేందుకు కూడా సై అంటూ ఎన్నికల సమరంలో నిలుస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక మినహా అన్నింటిలో ప్రాంతీయ పార్టీలదే రాజ్యాధికారం. భవిష్యత్ అంతా ప్రాంతీయ పార్టీలదే అనే హవా అంటున్నారు పలువురు నాయకులు. అయితే రానున్న కాలమంతా ప్రాంతీయ పార్టీలదేనా..?
ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎంత..? దేశంలో ప్రస్తుతం జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, రిజిస్టర్డ్ర్ పార్టీలు ఎన్ని ఉన్నాయి? జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు పొందాలంటే ఆయా పార్టీలు చేయాల్సిన పనులేంటి..? దక్షిణ భారతదేశం.., ఉత్తరభారతదేశంగా చూస్తే.. దక్షిణ ప్రాంతంలో ప్రాంతీయ పార్టీలదే హవా సాగతుంటుంది. ఉత్తరభారతంలో ఈ పరిస్థితి ఎలా ఉంది.? భవిష్యత్‌లో ఎలా మారే అవకాశం ఉందంటారు..? దేశంలో అంతగా రాజకీయ శూన్యత ఉందా..? అనే అంశాలపై నేటి ప్రతిధ్వని.