Reasons For Back Pain : నడుము, వెన్ను నొప్పులు బాధిస్తున్నాయా? ఇలా చేయండి రమ్మన్నా రావు! - వెన్నునొప్పి సమస్యకు పరిష్కార మార్గాలు
🎬 Watch Now: Feature Video


Published : Sep 17, 2023, 9:18 PM IST
Reasons For Back Pain And Remedies : ఉద్యోగులు గంటల తరబడి కూర్చొని పనిచేయడం వల్ల వెన్నునొప్పి సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వెన్నుముక విషయంలో చాలామంది అశ్రద్ధ వహిస్తుంటారు. దీనిని అంత తేలికగా తీసుకోకూడదంటున్నారు డాక్టర్లు. ఈ కారణం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన నడుము, వెన్నునొప్పులు వేధిస్తుంటాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఇష్టం వచ్చినట్లు కూర్చొని వెన్ను సమస్యలను కొనితెచ్చుకుంటున్నాం. ఎక్కువసేపు కూర్చొని ఉండటం వలన వెన్నెముక సహజ అమరికకు హాని కలుగుతుంది. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వలన కూడా వెన్నెముక శక్తి తగ్గుతుంది. పోషకాలు లేని ఆహారం తినడం ద్వారా శరీరంలో వాపు, మంట లక్షణాలకు దారి తీసే సమస్య ఇన్ఫ్లమేషన్కు దారి తీసే ప్రమాదం ఉంటుంది. కొవ్వు తక్కువగా, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు, పొట్టు తీయని ధాన్యాలు, మంచి కొవ్వు ఉన్న చేపలు, క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్-డీలు మనం తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. దీనితో వెన్నునొప్పి సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు. ఇక అతి తీవ్రంగా పరిగణించే ఈ వెన్నునొప్పి సమస్య, దాని నివారణ కోసం స్పైన్ సర్జన్ డా.సూర్య ప్రకాశ్ రావు గారు ఇస్తున్న సలహాలు, సూచనలను ఈ వీడియోలో తెలుసుకుందాం.